ఈ నెల 17న మెగా వైద్య శిబిరం

Published: Tuesday February 16, 2021

క్యాతన్పల్లి, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: పురపాలక సంఘం రామకృష్ణాపూర్ పట్టణం టిఆర్ఎస్ కార్యాలయంలో చైర్ పర్సన్ జంగం కళ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజును పురస్కరించుకొని బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిభరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైన్ చైర్మెస్ విద్యా సాగర్ రెడ్డి, సీనియర్ నాయకుడు అబ్దుల్ అజీజ్ లు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఫిబ్రవరి 17న బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమెమ్మల్యే బల్క సుమన్ వస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. రెండో వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎమ్మెలుగా గెలిచినప్పటి నుండి చెన్నూరు నియోజకవర్గంలో అనేక  అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంలో బాల్క ఫౌండేషన్ ద్వారా మెగా వైద్య శిభిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ క్యాంపును పురపాలక సంఘంలోని ప్రజలందరు నద్వినియోగం చేసుకోవాలని కోరారు. అపోలో రీచ్ వైద్యులు అందించే చికిత్సలు పరీక్షలు మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, ఎముకలు కీళ్లకు నరాలకు సంబంధిత వ్యాధులు చూడడంతో పాటు మూత్ర సంబంధిత వ్యాధులు మూత్ర పిండాలు సాధారణ జబ్బులు స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక నిపుణులు కన్ను , ముక్కు, గొంతు, వరీక్షలు నిర్వహించడంతో పాటు జనరల్ ఫిజీషన్ డెంటల్, జనరల్ సర్జన్, చిన్న పిల్లలతో పాటు వివిధ వ్యాధులకు ఉచిత వైద్యంతో పాటు తగిన మందులు ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆకాశాన్ని పురపాలక ప్రజలు  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిర్ఎస్ నాయకులు గాండ్ల నమ్మయ్య, కౌన్సిలర్లు సంపత్, తిరుపతి, అసీల్ రావు, కో ఆప్షన్ సభ్యుడు సుదర్శన్, మహిళా నాయకురాలు నరెడ్ ల కల్పన, యువనాయకులు సత్యసాల్, ఎర్రబెల్లి, రాజేష్, సతీష్ కుమార్, ప్రేమ్ సాగర్, చంద్రకిరణ్ తొండ కుమార్, తదితరులు పాల్గొన్నారు.