నిరుద్యోగ భృతి రాని ఎడల పట్టభద్రుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష

Published: Friday March 05, 2021

బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, పట్టభద్రుల ఎన్నికల సన్నావాక సమావేశం లో మాజీ ఎం ఎల్ ఏ, ఎమ్మెల్సీ బరిలో  ఉన్న చిన్నాన్న (జిల్లెల్ల చిన్నారెడ్డి) ప్రభుత్వం వాగ్దానం చేసిన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా నన్ను గెలిపించి పట్టభద్రుల పక్షాన ఆమరణ నిరాహార దీక్షకు సైతం లేదా  అక్కడే ప్రాణం వదులుతానని పట్టభద్రులందరూ భాగస్వాములు కమ్మని సవినయంగా విజ్ఞప్తి చేశారు. బడంగ్ పేట్  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ గ్రామం వై ఏ .ఆర్ గార్డెన్ లో గురువారం నాడు కాంగ్రెస్ డిసిసి చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నాల ప్రభాకర్ రెడ్డి, మాజీ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే (ప్రస్తుత ఎమ్మెల్సీ భారీ) లో ఉన్న చిన్నారెడ్డి కాంగ్రెస్ నేతలు పాల్గొని అనంతరం మాట్లాడుతూ.... ప్రశ్నించే గొంతుక కావాలి అందుకే మన చిన్నాన్న గెలవాలని... మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రులారా ఎన్నడూ లేని (93) మంది ఈ  భారీ పోటీ లో ఉన్నారు. కానీ  కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తెలంగాణ కు నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం తో మొదలైన తెలంగాణ ఉద్యమం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణం ముఖ్యం కాదు... రాష్ట్ర ముఖ్యమని ఆలోచనలతో, అదేవిధంగా కన్న తల్లిదండ్రుల ఆశలను ఆవిరి చేస్తూ, ఎంతో మంది అమరవీరుల త్యాగాల తో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, న్యాయవాదులు ఇలా ఎందరో సకల జనులు చేసిన పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంన్నామని అన్నారు. కానీ రాష్ట్రం సాధించి ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాల కాలంలోనే  కాంట్రాక్టర్ల జేబులు నింపే పథకాలను ప్రవేశపెడుతున్న మన ముఖ్యమంత్రిని గద్దె దింపాలని పట్టభద్రులందరూ ఏకం కావాలని ముక్తకంఠంతో కాంగ్రెస్ నేతలు పలికారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నాల ప్రభాకర్ రెడ్డి..... ఎమ్మెల్సీ అభ్యర్థులను గురించి పట్టభద్రులు పూర్తిగా తెలుసుకొని మచ్చ లేని మహారాజు గా నీతి నిజాయితీ నిలుపుటదం జిల్లెల్ల చిన్నారెడ్డి ని (చిన్నాన్న) అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ లో గెలిచి వేరే పార్టీలోకి పోయిన వారికే కాకుండా,  పట్టభద్రులు అయినటువంటి మేధావులారా ఆలోచించి ఎమ్మెల్సీ పట్టం కట్టండి అన్నారు. అభ్యర్థి చిన్నా రెడ్డి మాట్లాడుతూ..... పట్టభద్రులు అందరికీ విజ్ఞప్తి .... ఆలోచన విధానాన్ని అనుసరించి ఇప్పటికీ రాష్ట్రంలో మొన్న నాగేశ్వరరావు ఎమ్మెల్సీ గెలిచి ఎవరికి ఏం చెయ్యలేదు? అదేవిధంగా గతంలో బీజేపీ రామచంద్రరావు లాస్ట్ ఇయర్ నుండి ఎమ్మెల్సీ ఉండి ఏమీ ప్రయోజనం చేయలేదు? ఒక్క అవకాశం ఇవ్వండి పట్టభద్రులరా అందరికీ  మీ సమస్యలను ప్రభుత్వని  మెడ ఉంచి ఈ  పట్టభద్రుల సమస్యలని వెనువెంటనే  తీరుస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగులు పిఆర్సి, డి ఎ, సిపిఎన్ విరమణ వంటి సమస్యలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ప్రభుత్వం ఈయని యెడల ప్రగతి భవన్ గేటు ముందు ఆమరణ నిరాహార దీక్ష కు సైతం అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, కాంగ్రెస్ ప్రో లీడర్ ఏనుగు జంగారెడ్డి, వంశీధర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, శివసేన రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బడంగ్ పేట్   మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారు మనోహర్, బాలు నాయక్, దీ భాగ్యనగర్ సొసైటీ బ్యాంక్ వైస్ చైర్మన్ బంగారు బాబు, మీర్ పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్లు చల్లా కవితా బాల్ రెడ్డి, కార్పొరేషన్ అధ్యక్షులు సోమిడి గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దెప భాస్కర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు, అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యువకులు,  తదితరులు పాల్గొన్నారు.