భారతీయ జనతా పార్టీ నాయకులు అరెస్ట్

Published: Wednesday July 07, 2021
ఇబ్రహీంపట్నం, జూలై 07 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని పల్లె ప్రగతి కార్యక్రమానికి విచేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకుంటారనే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఉడుత రాజు, కార్యదర్శి చెరుకు రాజు, ఐటి సెల్ కన్వీనర్ అక్కపెళ్లి జలందర్, బీజేవైయం మండల ఉపాధ్యక్షుడు అనురెడ్డి దినేష్ రెడ్డి, గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు చాట్ల రాజేందర్ లను మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఉడుత రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంతపరిపాలన కొనసాగుతుందని మంత్రులకు కూడా విలువ లేకుండా ఫామ్ హౌస్ నుండి పాలన సాగుతున్న తెలంగాణలో మంత్రుల పర్యటనలకు బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటని కేంద్ర ప్రభుత్వం నిధులను తమ నిధులు గా చెప్పుకోవడం టి ఆర్ యస్ పార్టీకే చెల్లిందని తెలిపారు, ప్రభుత్వం ఇవ్వవలసిన కనీస సౌకర్యాలు విద్యా వైద్యం ఉపాధిలో పూర్తిగా విఫలమైందని తక్కువ జీతాలతో ఉద్యోగం చేస్తున్నా ఉపాధి హామ క్షేత్ర స్థాయి సహాయకులు ఏడువేల ఆరువందల యాబై ఒక్క ఉద్యోగుల కుటుంబను విధిపాలు చేసిన ప్రభుత్వం మంత్రి పర్యటనకు ఇబ్రహీంపట్నం మండలంలోని ఉపాధి హామీ క్షేత్ర స్థాయి సహాయకులను అరెస్టు చేయడం ప్రభుత్వ పతనానికి దారితీస్తుందని తెలిపారు.