ఆదర్శ పాఠశాలలో ఎన్.సి.సి ప్రారంభం

Published: Friday October 29, 2021
యాదాద్రి అక్టోబర్ 28 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి ఎన్.సి.సి తో శిక్షణ పొందిన విద్యార్థులు జీవితంలో క్రమశిక్షణ అలవాటు చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకుంటారని మండల పరిధిలోని లోతుకుంట గ్రామంలో గల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జి. రాము అన్నారు. గురువారం పాఠశాలలో ఎన్.సి.సిని 31 వ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్ నెంట్ కల్నల్ వినయ్ డాకా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఎన్ సి సి పాఠశాల ఇంచార్జ్ డాక్టర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ సి సి సబ్ మేజర్ రాజేంద్రన్ నాయర్, ఉపాధ్యాయులు ఐలయ్య, కనకదుర్గ, అనసూయ, దామోదర్, పూర్ణిమ, వెంకటేశం, జంతిలాల్, మహేందర్, నాగేష్, లింగస్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.