మండలంలో పర్యటించిన చైల్డ్ రైట్స్ బృందం

Published: Thursday November 24, 2022
బోనకల్, నవంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: మండలం లో క్రై సంస్థ సహకారంతో ఎఫర్ట్ సంస్థ ఆధ్వర్యంలో బాలల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటు, అడాల్సేంట్ గర్ల్స్ గ్రూపులు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ ల ఏర్పాటు మండలంలో ఏర్పాటు చేసిన 5 ఆక్టివిటీ లెర్నింగ్ సెంటర్లను బెంగళూరు నుండి వచ్చిన క్రై బజాజ్ సంస్థ బృంద సభ్యులు బుధవారం పర్యవేక్షించడం జరిగింది. ఈ పర్యటన లో భాగంగా చొప్పకట్ల పాలెం లో కమ్యూనిటీ లెవెల్ లో జరుగుతున్న మీటింగ్ ను సందర్శించడం జరిగింది. అనంతరం ముష్టికుంట్ల గ్రామంలో క్రై సంస్థ సహకారంతో ఎఫర్ట్ సంస్థ నిర్వహిస్తున్న యాక్టివిటీ లెర్నింగ్ సెంటర్ ను సందర్శించి అక్కడ ఉన్న పిల్లలతో వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారికి సెంటర్లో అందుతున్న సేవలపై సంతృప్తిని వ్యక్తం చేసారు. అదేవిధంగా రామాపురం గ్రామంలో జరుగుతున్న గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ల నెంబర్లతోటి, అంగన్వాడి ఆశ ఏఎన్ఎం, ఐసిడిఎస్ సిబ్బంది గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలో సభ్యులు వారి తీరుతెన్నులను తెలుసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ లో గ్రామంలో ఉన్న పెద్దలతోటి బాలలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. తదనంతరం గోవిందాపురం ఎల్ గ్రామంలోని హైస్కూల్ను కమిటీ సభ్యులు సందర్శించారు. పాఠశాలలో వున్న స్థితిగతులను అక్కడ ఉన్న సమస్యల గురించి బాలలకు అందుతున్న సౌకర్యాల గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ఎస్ఎంసి చైర్మన్, సభ్యుల తో కూలంకషంగా చర్చించడం జరిగింది. తర్వాత బోనకల్ పాఠశాల నందు యుక్త వయసు బాలికలతో జీవన నైపుణ్యాలకు సంబంధించిన విషయాలు జరుగుతుండగా వారు పాల్గొన్నారు. బాలికలకు వారి యొక్క స్వీయ గుర్తింపు లో భాగంగా నేను ఎవరిని? నా ఇష్టం ఏమిటి? అలాగే ఒక్కొక్క వ్యక్తిలో ఉన్నటువంటి భేదాలు అసమానతలను తొలగించుకొని జీవితంలో ఉన్నత స్థానానికి ఎలా చేరుకోవాలో నేర్పించారు. అనంతరం
 మండలంలో వివిధ ఏరియాలలో జరిగిన కార్యక్రమాలలో ముంబై నుండి వచ్చిన బజాజ్ సంస్థ ఇంచార్జులు మానసి, శుభం పటేల్ , క్రై సంస్థ సౌత్ రీజియన్ హెడ్ సునీల్ పీటర్, వెస్ట్ రీజియన్ హెడ్ కుమార్ నీలెందు, రెండు తెలుగు రాష్ట్రాల సీనియర్ మేనేజర్ చెన్నయ్య, జిల్లా బాలల సంరక్షణ అధికారి విష్ణు వందన, సిడిపివో వీరభద్రమ్మ , సూపర్ వైజర్ రమాదేవి , ముష్టికుంట్ల గ్రామ సర్పంచి బి జాన్ బి, హుస్సేన్ , గ్రామ పెద్దలు బంధం శ్రీనివాసరావు, చెల్ది ప్రసాదరావు, పిల్లల తల్లిదండ్రులు, చొప్పకట్లపాలెం గ్రామ సర్పంచి సుబ్బారావు, అంగన్వాడి టీచర్ జయమ్మ, గ్రామ దీపిక దివ్య, ఆశా వర్కర్ రాణి, గ్రామ పెద్దలు, ఎఫర్ట్ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కే విజయకుమార్, రామాపురం వైస్ సర్పంచ్ నాగేశ్వరావు, పంచాయతీ కార్యదర్శి సౌమ్య, ఎస్ఎంసి చైర్మన్ మణికుమార్ , ఇశ్రం రూబేను, ఆర్ఎంపీ డాక్టర్ ఎస్ కే జానీ మియా, పూజారి శ్రీనివాసరావు , గ్రామ దీపిక ఉమా, వివో అధ్యక్షురాలు జ్యోతి,అంగన్వాడీ టీచర్లు నాగమణి, ఆశా కార్యకర్త రేణుక , యువజన లీడర్లు దేవ పంగి వెంకటేశ్వరరావు, గోవిందాపురం ఎల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ రాజ్యం, ఉపాధ్యాయులు శివ, బాలస్వామి, నాగభూషణం, ఎస్ఎంసి చైర్మన్ లక్ష్మణరావు, ఎస్ఎంసి మెంబర్ పోతగాని రామ కృష్ణ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ సురేష్, సంస్థ బాధ్యులు కరుణ, గురవమ్మా, నరసమ్మ, రాణి, అరుణ, బుజ్జి, స్వాతి, లాల్ బి, మౌనిక, పద్మ కళ , డీసీపీయు స్టాఫ్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.