దళిత సంఘాలన్నింటికీ కన్నీళ్లతో క్షమాపణలు చెప్పిన రంగా కిరణ్

Published: Thursday March 25, 2021

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 24, ప్రజాపాలన ప్రతినిధి : రంగా కిరణ్ కు అంబేద్కర్ గారి పట్ల జరిగిన దృష్టాంతం దురదృష్టకరం అని శోచనీయమని భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం నాయకులు మద్దెల శివ కుమార్ కూ సపాటి శ్రీనివాస్ మందా హనుమంతు చంద్రగిరి గోపీచంద్ అర్ సబ్బవరపు మధుసూదన్ చిన్ని మరియు కోలపూడి ధర్మరాజులు ఉద్ఘాటించారు 24 03 2021 నాడు స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద గల సంఘ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడారు ఇదివరకే రంగా కిరణ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పాలతో కడిగి పూలమాలలు వేసి కన్నీళ్లతో క్షమాపణలు నివాళులర్పించారు అప్పుడు కొందరు మన దళిత సంఘాల నాయకులు ఆయనను గట్టిగా తీవ్రపదజాలంతో మందలించి బుద్ధి చెప్పినారు అయినా రంగా కిరణ్ తిరిగి పూర్తి పశ్చాత్తాపంతో కన్నీటితో దళిత సంఘాల నాయకులు అందరికీ తమక్షమాపణలు తెలియజేశారు ఈ మొత్తం ఉదంతంపై భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం నుండి నాయకులు మంద హనుమంతు చంద్రగిరి గోపీచంద్ అర్ కోలపూడి ధర్మరాజు తదితరులు నిజ నిర్ధారణ కమిటీ గా వెళ్లి విషయం అంతటిని కూలంకషంగా తెలుసుకొని నిజానిజాలను పరిశీలించి ఈ అనుచిత వ్యాఖ్యలు రంగా కిరణ్ ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి కావని రాష్ట్రీయ దళిత సమితి నాయకుడు హమారా ప్రసాద్ అనే వ్యక్తి యదార్థానికి అంబేద్కర్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది అతను రంగా కిరణ్ కు స్నేహితులు కావడం వల్ల రంగా కిరణ్ వాట్సప్ కూడా ఈ పోస్టింగ్ రావడం జరిగింది అప్పుడు అనుకోకుండా రంగా కిరణ్ అనుచరుడు ఈ పోస్టింగ్ ను ఫార్వార్డ్ చేయడం జరిగింది రంగా కిరణ్ కన్నీటి పర్యంతమై ఈ విషయాలను తెలియజేస్తూ ఏదిఏమైనా అనుకోకుండా జరిగిన ఈ పొరపాటు కు తాను హృదయ పూర్వక క్షమాపణలు కోరుతున్నానని తాను కూడా బిసి కులానికి చెందిన వ్యక్తిని అని బాబాసాహెబ్ అంబేద్కర్ తమకు కూడా ఆరాధ్య దైవమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల అందరూ కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగం పుణ్యమా అంటూ ఈ సమాజంలో సముచితమైన స్థానాన్ని హోదాను పొందినారు అని బాబాసాహెబ్ ను కొనియాడారు ఇక ముందు తాను అంబేద్కర్ గారి కి సంబంధించిన అన్ని కార్యక్రమాలలో తనను ఆహ్వానిస్తే తప్పకుండా హాజరై తన వంతు సహకారాన్ని కూడా అందిస్తానని మరొకసారి తనను దళిత సంఘాల నాయకులు అందరూ హృదయపూర్వకంగా క్షమించాలని కన్నీటితో వేడుకున్నారు ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ దృష్టాంతం ఎంతో దురదృష్టకరమని రంగా కిరణ్ పశ్చాత్తాపపడి క్షమాపణలు కోరిన కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలి వేయడం మంచిదని పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం వేరే లేదని ఇతర దళిత సంఘాల నాయకులు కూడా ఈ విషయాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఈ విషయానికి ఫుల్స్టాప్ పెట్టాలని అందరినీ సవినయంగా కోరుకుంటున్నామని అభ్యర్థించారు ఈ అత్యవసర సమావేశంలో మద్దెల శివ కుమార్ కూసపాటి శ్రీనివాస్ మంద హనుమంతు చంద్రగిరి గోపీచంద్ అర్ సబ్బవరపు మధుసూదన్ చిన్ని కోలపూడి ధర్మరాజు అంతోటి పాల్ బొంకురి పరమేష్ దుర్గేశ్ కొండ్రు మహేష్ బుస్సీ రఘు అంతోటి రాజు జోసప్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు