కార్పొరేటర్ రాగం చొరవతో నిలిపివేసిన బిహెచ్ఇల్ ప్రహరీ గోడ నిర్మాణం

Published: Friday July 30, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడాట్రెడ్ సెంటర్ దగ్గర బిహెచ్ఇల్ వారు నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణం వాళ్ళ పరిధి దాటి 25 మీటర్లు ముందుకు జరిగి కడుతున్నారని తెలియటంతో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హుటాహుటిన అక్కడికి చేరుకుని బిహెచ్ఇల్ అధికారులతో మాట్లాడటంతో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు, అక్కడికి చేరుకున్న బిహెచ్ఇల్ అధికారులకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గతంలో 2001లో కౌన్సిలర్ గా ఉన్నప్పుడు అప్పుడు ఉన్న అధికారులతో తాను ఏర్పరచిన హద్దులను చూపించి వారికి అక్కడ ఉన్న వాస్తవ సమాచారాన్ని వివరించారు, దీనికి స్పందించిన అధికారులు మేము దీనిని పూర్తిగా తెలుసుకున్నకే నిర్మాణం చేపడుతామని అప్పటి వరకు పనిని నిలిపివేస్తాము అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో  బిహెచ్ఇల్ అధికారులు ఏజిఎం గంగారం, డిజీఎం శశికిరన్, చంద్రశేఖర్, సీనియర్ ఇంజనీర్ నారాయణ రెడ్డి, వటౌన్ ప్లానింగ్ అధికారి విశాల్ హుడాట్రెడ్ సెంటర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, కోటేశ్వరరావు, ప్రభాకర్,కుమార్, పాండురంగయ్య, శ్రీనివాస్ రమణమని, సుమన్, భీమయ్య, బుచ్చిరెడ్డి, మహేష్ గౌడ్, సందయ్య నగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు బసవయ్య, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.