రైతుబంధు ముగింపు ఉత్సవాల్లో రైతులను సన్మానించిన డీసీఎంఎస్ డైరెక్టర్ నాగబండి శ్రీనివాసరావ

Published: Tuesday January 11, 2022
పాలేరు జనవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : రైతు బంధు సంబురాల గంగా ఈరోజు పైనంపల్లి ఎం సి ఎస్ పరిధిలో కార్యక్రమాలు నిర్నహించబడినవి. గత వారం రోజులుగా మండలంలో రైతుబంధు సంబరాలు - వ్యవసాయ శాఖ తరుపున నిర్వహించబడినవి. ఈ సంబరాలలో విద్యార్థులకు పోటీ పరీక్షలు, మహిళ సంఘాలకు ముగ్గుల పోటీలు నిర్వహించ బడినవి. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పెనంపల్లి గ్రామ పరిధిలో గల పిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం జరిగింది. అదేవిధంగా గౌరవ రైతులను సన్మానించి వారికి మొక్కలను అందించడం. జరిగింది. ఈ రైతుబంధు పధకం రైతులకు ఎంత  గొప్పగా ఉపయోగ పడుతుందని  పలువురు వక్తలు మాట్లాడారు. ఈ రైతు బంధు పథకం మొక్క డబ్బులు పూర్తిగా వ్యవసాయ పనుల నిమిత్తం ఉపయోగించుకొంటే ఎంతో మేలు జరుగుతుందని తెలిపినారు. ఈ  కార్యక్రమంలో పైనంపల్లి పిఎసిఎస్ చైర్మన్ ఖమ్మం డి సి ఎం ఎస్ డైరెక్టర్. డా.నాగు బండి శ్రీనివాసరావు, నేలకొండపల్లి రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు శాఖమూరి సతీష్, నేలకొండపల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉన్నాం బ్రహ్మయ్య, సి డి సి చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాద్, నేలకొండపల్లి ఎంపీపీ. వజ్జా రమ్య, జెడ్ పి. వైస్ చైర్మన్ ధనలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారులు ఎం ఏవో నారాయణ రావు, మరియు సొసైటీ పాలకవర్గ సభ్యులు రైతులు పలువురు పాల్గొన్నారు