వడగండ్ల వర్షానికి చెట్లు విరగడంతో అంతరాయం..

Published: Wednesday January 12, 2022

బీరుపూర్, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ తాళ్లధర్మారం గ్రామంలో సోమవారం సాయంత్రం 7 గంటలకు భారీగా ఈదురు గాలులు వడగండ్ల రాళ్ళ వర్షానికి గ్రామంలోని తాటిచెట్లు రోడ్డు ప్రక్కన చెట్లు విరిగి పడడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే గ్రామ సర్పంచ్ నల్ల మహిపాల్ రెడ్డి పంచాయతీ సిబ్బంది కలసి చెట్లను తొలగించి రోడ్లను శుభ్రం చేయడంతో నిలిచిన వాహనాలన్నీ వెల్లిపోయాయి.