హమిలు నెరవేర్చని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వని మునుగోడు ప్రజలుఉప ఎన్నికల్లో ఓడించాలి వైయస్స

Published: Saturday October 29, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 28ప్రజాపాలన ప్రతినిధి

మంచాల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అమిలు అమలు చేయటంలో పూర్తిగా విఫలం అయ్యింది అన్నారు ముఖ్యంగా రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలు మాపి చేస్తాను అని మాపి చేయలేదు నిరుపేద కుటుంబాలకు డబల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయలేదు భూమి లేని దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయలేదు రైతుల భూములు సక్రమంగా సారి చేయటానికి పూర్తి స్థాయిలో ధరణి పోర్టల్ అమలు చేయలేదు మునుగోడు నియోజకవర్గం.సంస్థాన్ నారాయణ పురం మండలం రాచకొండ ప్రాంతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల్లో తార తరాల నుండి సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిజన రైతులకు గత ప్రభుత్వాలు పాస్ బుక్ లు పంపిణీ చేసారు రైతులకు అన్ని విధాలుగా హక్కులు కల్పించారు కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాచకొండ రైతుల భూమి రికార్డు వివరాలు మొత్తం ఆన్ లైన్ నుండి తొలగించి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరా అన్యాయం చేసింది రాచకొండ భూముల కోసం రైతులు ఇప్పట్టికి పోరాటం చేస్తున్న వారికి న్యాయం జరగలేదు అన్నారు అలాగే మార్రిగూడా మండలం చర్లగూడెం ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులకు గ్రామాల్లో ఇండ్లు కోల్పోతున్న ప్రజలకు ఇప్పట్టి వరకు పూర్తి స్థాయిలో పరిహారం చెలించటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది అన్నారు అందుకే ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన T R S ప్రభుత్వనికి మునుగోడు నియోజకవర్గం ప్రజలు ఉప ఎన్నికల్లో ఓడించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలి అన్నారు