బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం సీఎంఓ వెంకటేశ్వరరావు

Published: Wednesday November 30, 2022
బెల్లంపల్లి నవంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి లోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని సంస్థ ముఖ్య వైద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు.
మంగళవారం సింగరేణి ఏరియా ఆసుపత్రి సందర్శించి ఆయన విలేకరులతో మాట్లాడారు, కోవిడ్ సందర్భంగా మూసివేసిన వార్డులను, యధావిధిగా కొనసాగిస్తామని, వారం వారం వచ్చే స్పెషలిస్ట్ డాక్టర్లను ప్రతిరోజు అందుబాటులో ఉండే విధంగా తగిన ఏర్పాట్లు చేయిస్తానని, కార్మికులను, కార్మికుల కుటుంబ సభ్యులను ఇతర ఆస్పటల్స్ కు రెఫరల్ చేయకుండా స్థానికంగానే వైద్య సహాయం అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.
కార్మికులు ఊహిస్తున్నట్లు ఆస్పత్రిని  తగ్గించే ఆలోచన లేదని, రానున్న రోజుల్లో బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ కి మంచి రోజులు వస్తాయని అన్నారు.
అనంతరం ఆసుపత్రి వార్డుల్లోనూ, ఆక్సిజన్ ప్లాంట్, మెడికల్ స్టోర్ లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డివైసిఎంఓ, రామాల శౌరి,  ఫిట్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, మ్యాట్రిన్ ఎన్, విజయలక్ష్మి, అసిస్టెంట్ మ్యాట్రిన్ అరుణసుందరి, కార్మిక నాయకుడు చిప్ప నరసయ్య,  తదితర ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.