ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

Published: Tuesday March 14, 2023

జగిత్యాల, మార్చి 13 (ప్రజపాలన ప్రతినిధి): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా పొలాస గ్రామంలోని పౌలస్తేశ్వరా స్వామీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శతాభిషేకం నిర్వహించారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సంగెపు మహేష్ ఎంపీపీ ములాసపు లక్ష్మి పాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి సందీప్ రావు రూరల్ అర్బన్ మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెరుకు జాన్ గంగాధర్ ఆలయ ఛైర్మెన్ కొండల్ రావు సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామశాఖ అధ్యక్షులు నాయకులు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.