హిందూ కుల మతోన్మాదుల తప్పుడు ఫిర్యాదులను దళిత క్రైస్తవులు ఏ విధంగా ఎదుర్కొనాలి?-ఎఐడిఅర్ఎఫ్

Published: Wednesday June 30, 2021
హిందూ మత, కుల వ్యవస్థలోని  షెడ్యూల్డ్ కులాలకు చెందని, శూద్రులు వెనుకబడిన కులాలకు చెందిన కురబ కులస్తులు, క‌ర్నూల్ జిల్లా నంద‌వ‌రం మండ‌లంలోని గుర‌జాల గ్రామంలో ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి అనుమ‌తులు తీసుకోకుండా 2018లో ఐఎంబీ చర్చి పేరిట క్రైస్తవ ప్రార్ధనా మందిరం నిర్మించడం, ఎస్సీ కులస్థులు చర్చికి వెళ్ళడం, క్రైస్తవులుగా మారిన వ్యక్తులు తమపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టడం వంటి అంశాలపై ఆగ్రహించిన బి.సిలు ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అంతే కాదు, ఈ సమస్యలను పరిష్కరించకపోతే న్యాయపరమైన పోరాటం సాగిస్తామని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు తేల్చిచెప్పారు. 
ది:31-12-2020 ఆరగంటి ఆడం స్మిత్ ఫిజియోథెరపిస్ట్ మాదిగ యువకుడు, బిసి కులానికి చెందిన బిఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్న మహేశ్వరిని ప్రేమ పెళ్లి చేసు కున్నందుకు అమ్మాయి తండ్రితో సహా బందువులు ఎస్సీ యువకుడిని హిందూ కుల మతోన్మాదంతో అడమ్ స్మిత్ హత్య ఈ గ్రామంలోనే జరిగింది. ఈ ఉదంతం తర్వాతనే సాంఘిక బహిష్కరణ జరుగుతూ ఉన్నది. గురజాల గ్రామంలో 200 బిసి కురబ కుటుంబాలు వందకు పైగా ఇతర కులాలు నివసిస్తున్నాయి. కేవలం 60 కులాలు మాత్రమే ఎస్సీ మాదిగ కుటుంబాలు ఉన్నాయి. తాజాగా ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమను పనిలోకి రానివ్వడంలేదు అని, తమను వివక్షకు గురిచేస్తున్నారని ఆరోపించిన బాధితులు, చర్చికి ప్రహారీ గోడ నిర్మాణం విషయంలో కూడా తమకు అడ్డుపడుతున్నారు అని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గ్రామంలోని 12 మందితో పాటు మరికొందరి మందిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
షెడ్యూల్ కులాల పట్ల రాజ్యాంగము  చట్టం ఏమి చెబుతుంది?
1.భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25-28 ద్వారా హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కు. భారతదేశంలోని ప్రతి పౌరుడికి తమ మతాన్ని శాంతియుతంగా ఆచరించడానికి మరియు ప్రోత్సహించడానికి హక్కు ఉంది. మత స్వేచ్ఛ అనేది కుల మతాలకు అతీతంగా ఒక వ్యక్తికి లేదా సమాజానికి స్వేచ్ఛను, ప్రభుత్వం లేదా ప్రైవేటులో, ఆరాధన మరియు ఆచారాలలో నమ్మకాన్ని వ్యక్తపరచటానికి మద్దతు ఇచ్చే ప్రాథమిక హక్కు.
2. బాపట్ల మున్సిపల్ చైర్మన్ కూరపాటి మరియదాసు తన సర్వీస్ రిజిస్టర్లో క్రైస్తవ మతాన్ని ఆచరిస్తానని చెప్పినందుకు హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్ఛింది. దానిపై సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నెంబర్: 2617/2009, SLP సివిల్ నెంబర్: 15144/2006, ది:18-4-2009 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ మార్కండే కట్జు, జస్టిస్ వి.ఎస్ సిర్పుర్కర్లతో కూడిన ధర్మాసనం 2007లో మరియాదాస్ దాఖలు చేసిన అప్పీల్‌పై తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం, ఏదైనా ఎన్నికల వివాదం ఎన్నికల పిటిషన్ ద్వారా పరిష్కరించ బడాలని మరియు కుల ధృవీకరణ పత్రం యొక్క యథార్థతను నిర్ణయించడానికి హైకోర్టు సరైన వేదిక కాదని, ఒక వ్యక్తి కులం, మతం మారడం నిర్ధారించాల్సింది ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ తప్ప హైకోర్టు కాదని 2007 సెప్టెంబరులో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
3.తమిళనాడు హైకోర్టు ది:28-12-2013లో షెడ్యూల్ కులాల వారు చర్చికి వెళ్లారని, ఎస్సీ హోదా సర్టిఫికెట్  నిరాకరించడం తప్పని  తేల్చిచెప్పింది. డివిజన్ బెంచ్ జస్టిస్ ఎం.పాల్ వసంత్ కుమార్ మరియు జస్టీస్ టి.ఎస్. శివ జ్ఞానం గార్లు పుదుచ్చేరికి చెందిన సబ్ కలెక్టర్ ఎస్సి సర్టిఫికేట్ నిరాకరించడంపై "ఎస్సీ స్థితిని నిర్ణయించడానికి, ధృవీకరించవలసిన అంశాలు ఆ వ్యక్తి ఎలాంటి సామాజిక మరియు ఆర్థిక వైకల్యంతో బాధపడుతున్నాడు మరియు ఆ ప్రాంతంలోని షెడ్యూల్డ్ కులాలవారిని హిందువులు, ఏవిధంగా చూస్తున్నారో తెలుసుకోవాలని న్యాయమూర్తులు చెప్పారు.""
4.కేరళ హైకోర్టు జూలై 27, 2015న హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డ్ కులం/తెగ సభ్యుడు హక్కులను పొందవచ్చునని, మరియు ఎస్సీఎస్టీలు అతను తిరిగి మారినట్లయితే ప్రయోజనాలు లభిస్తాయి కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. హిందూ మితవాద విశ్వ హిందూ పరిషత్ గతేడాది 33,000 మంది వ్యక్తులను మరియు 48,000 మతమార్పిడులను ‘నిరోధించారు’. ‘ఘర్ వాప్సీ’ పునర్వ్యవస్థీకరణ ప్రచారం నేపథ్యంలో కోర్టు నిర్ణయం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
5.ది: 8-01-2020 రిజర్వేషన్లు “మతం అతీతంగా" ఉండాలన్న దళిత క్రైస్తవుల విజ్ఞప్తిని పరిశీలించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ప్రెసిడెన్షియల్ యాక్ట్ 1950, రాజ్యాంగంలోని మూడు పేరా (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్, షెడ్యూల్డ్ కులాల క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల హోదాను పొందకుండా అడ్డుకుంది. సుప్రీంకోర్టులో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత క్రైస్తవుల (ఎన్‌సిడిసి) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. “"ఎస్సీలు క్రైస్తవ మతంలోకి మారినంత మారిన సామాజిక అంటరానితనం నుండి మినహాయింపు ఈ దేశంలో జరగటం లేదు.""
6.WP No:17616/2020 అలోకం సుదాకర్ బాబు Vs ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బైబిల్ చదవడం , ఇంట్లో క్రైస్తవ పటాలు ఉండటం , చర్చి కి వెళ్ళినంత మాత్రాన ఎవరూ క్రైస్తవులు కాదు అని గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ వారు ఇచ్చిన తీర్పును హిందూ కులమతోన్మాదులు చదవాలి. ఎస్సీ ఎస్టీలపై తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒక్కసారి కుల ధృవీకరణ పత్రం జారీచేసిన తరువాత ఆ ధృవీకరణ పత్రం రద్దు అయ్యేవరకు అది అమలులో ఉంటుంది, మరియు ఆ కుల ధృవీకరణ పత్రం రద్దు అనేది 1993 చట్టం కింద జిల్లా కలెక్టరు చెయ్యవలసి ఉంటుంది. కనుక ఆ ఫిర్యాదుదారుడిపై ఎస్సీలు & ఎస్టీలు (పిఒఎ) చట్టం, 1989 లోని సెక్షన్ 3 (1) (క్యూ) కింద శిక్షార్హమైన నేరానికి పోలీసులు ఎఫ్ఐఅర్ చేయాలి. ప్రభుత్వం ద్వారా ఎస్సీ హోదా పొంది క్రైస్తవ విశ్వాసం కలిగిన వారు బుద్ధిని ఉపయోగించాలి.
ఎ. విశ్వహిందూ పరిషత్ ఏ విధంగా ఎస్సీ క్రైస్తవులను తిరిగి హిందువులుగా మారుస్తున్నారో, అదే విధంగా క్రైస్తవ విశ్వాసం కలిగిన ఎస్సీలు, దేవుని ప్రమేయం లేని  బుద్ధుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మార్గంలో బౌద్ధం స్వీకరించాలి. ప్రతి గృహంలో బుద్ధుడు అంబేడ్కర్ పోటోలు,  బుద్ధుడు అతని ధమ్మము అనే పుస్తకము మరియు పంచశీల జెండాను అలంకరించుకోవాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు హిందూ మాల, హిందూ మాదిగ సర్టిఫికేట్ బదులుగా ప్రభుత్వం వారిచే  కేవలం మాల, మాదిగ కులో సర్టిఫికెట్లు పొందాలి.
బి. ఈ దేశంలో హిందువులు ఇస్లాం మత విశ్వాసాల కలిగి దర్గాకు వెళ్ళి తాయత్తులు కట్టించుకుంటారు. అక్కడ నమాజ్, పునస్కారాలు చేసుకుంటారు. శూద్రులు 30% మంది క్రైస్తవ మతాన్ని పాటిస్తారు. కానీ వీరందరూ జనాభా లెక్కల్లో హిందువులుగానే నమోదు చేసుకుంటూ ఉంటారు. అలాగే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు కూడా క్రైస్తవ మత విశ్వాసం కలిగి ఉంటే చర్చిలకు వెళ్లటం రాజ్యాంగ వ్యతిరేకం ఏమీ కాదు. కానీ చర్చిలో తమ పేరును నమోదు చేసుకోవద్దు. ఎస్సీ క్రైస్తవులు మూడు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
1.రికార్డెడ్ గా బాప్తిసం తీసుకొనరాదు. అలాంటి వాటికి సాక్ష్యాలు లేకుండా ఉండాలి.
2. వివాహము క్రైస్తవ మత ఆచార ప్రకారం చర్చిలో చేసుకొనరాదు.
3. చనిపోయిన తర్వాత భూస్థాపిత కార్యక్రమాల్లో క్రైస్తవ కలిగిన చిహ్నాలు ఉండరాదు. ఈ విధంగా చేస్తే మీరు ఎస్సీలు గానే పరిగణించబడతారు.
కర్నూలు జిల్లా, నందవరం మండలం, గురజాల గ్రామము ది:31-12-2020 నుండి 60 ఎస్సీ మాదిగ కుటుంబాలపై విధించిన సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలి. సెక్షన్ 3 (1) (6) & 3 (1) (10) of Sc & ST (POA) Act  ప్రకారము దోషులను శిక్షించాలని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం డిమాండ్ చేస్తుంది. సాంఘిక బహిష్కరణ వలన ఆర్థికంగా నివసించడానికి, జీవించడానికి అవకాశం లేకుండా ఆధిపత్య కులాల వారు చేసిన సాంఘిక బహిష్కరణపై జాతీయ ఎస్సీ కమిషన్ ప్రాంతీయ కార్యాలయం డైరెక్టర్ గారు సహృదయతతో వెంటనే చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటి ప్రకారం చర్యలు తీసుకొని బాధితులందరికీ సత్వర ఆర్థిక న్యాయసహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
 
బేతాళ సుదర్శనం
ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్