కోటి 50 లక్షల సి.సి రోడ్డుకు భూమి పూజ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

Published: Thursday July 07, 2022

వెల్గటూర్, జూన్ 06 (ప్రజాపాలన ప్రతినిధి) వెల్గటూర్ మండలంలోని పాశిగామ గ్రామ  కెనాల్ దారి నుండి కోటిలింగాల వరకు నిర్మాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం శంకుస్థాపన చేశారు. పాసిగామ నుండి కోటిలింగాల వరకు సి.ఆర్.ఆర్ నిధుల నుండి మంజూరైన కోటి యాభై లక్షలతో సీ.సీ రోడ్డు నిర్మాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక కె.సి.ఆర్ సారథ్యంలో పల్లెల రూపురేఖలు ఊహించనంతగా మారిపోతున్నాయని, రోడ్డు లేని ఊర్లే లేవని, పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని మంత్రి అన్నారు. కార్యక్రమంలో ఎం.పి.పి కూనమల్ల లక్ష్మి లింగయ్య, జెడ్పిటిసి బి.సుధారాణి రామస్వామి, స్థానిక సర్పంచ్ చల్లూరి రూపా రాణి రామచంద్ర గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పోడేటి సతీష్ గౌడ్,సర్పంచ్ లు తిరుపతి, ఎం.పి.టి.సి.లు మూగల రాజేశ్వరి సత్యం, ఏ ఎం సి.చైర్మన్ చైర్మన్ పత్తిపాక వెంకటేష్, పొడేటి రవి గౌడ్, రవితేజ,అధ్యక్ష కార్యదర్శులు సింహాచలం జగన్,జూపాక కుమార్, సహకార సంఘం అధ్యక్షులు గూడ రాంరెడ్డి, గోలి రత్నాకర్, గుండ జగదీశ్వర్,రంగు తిరుపతి,భాస్కర్,భానేష్,రమేష్,సతీష్,రవి తదితరులు పాల్గొన్నారు.