మృతురాలు రమాదేవి కుటుంబానికి సిఐటియు ఆధ్వర్యంలో 25 వేలు ఆర్థిక సహాయం అందించారు

Published: Thursday July 07, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 6ప్రజాపాలన ప్రతినిధి 

చనిపోయిన అంగన్వాడీ టీచర్ రమాదేవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి కవిత, సిఐటియూ జిల్లా అధ్యక్షులు జగదీష్ డిమాండ్ చేశారు. తిప్పాయిగూడ గ్రామంలో 35 సంవత్సరాలుగా అంగన్వాడి టీచర్ గా పని చేస్తున్న రమాదేవి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మరణించడం జరిగింది. అంగన్వాడీ లో పని ఒత్తిడితో జూన్ 25వ తేదీన ఇబ్రహీంపట్నంలోని అంగన్వాడీ ప్రాజెక్టు మీటింగ్లో హార్ట్ ఎటాక్ రావడంతో తోటి కార్మికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుంటే సిడిపిఓ, సూపర్వైజర్లు ప్రేక్షక పాత్ర వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆపరేషన్ కోసం హైదరాబాదులోని కామినేని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం ఆ కుటుంబానికి తీరనిలోటని అన్నారు. 35 సంవత్సరాలు అంగన్వాడిలో సేవలు చేసిన ఎటువంటి ఆధారం లేకుండా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ప్రభుత్వం పని భారం మోపడం తప్ప వారికి ఎటువంటి సహకారం ప్రభుత్వం నుండి ఇవ్వకపోవడం దారుణం అన్నారు. గౌరవంగా అంగన్వాడి టీచర్ పేరుకు మాత్రమే తప్ప ఎటువంటి ప్రమాదాలు జరిగిన ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. కనీసం మట్టి ఖర్చులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. మరణించిన రమాదేవి భౌతిక ఆయనకి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులతో ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. మట్టి ఖర్చులు 20వేలు ఇవ్వాలి. రిటైర్ బెనిఫిట్స్, మరణించిన వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
                     ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పోచమోని కృష్ణ, బుగ్గరాములు, ఎల్లేష్, స్వప్న, రాజ్యలక్ష్మి, బేబీ, బాలమణి, వైదేహి, మంచాల, యాచారం, ఇబ్రహింపట్నం మండలాల వివిధ గ్రామాల టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.