తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి దళిత బంధు పథకం దళారులకు వరం లాగా మారింది అని నిధులు దుర్వినియోగ

Published: Tuesday July 05, 2022

తాండూర్  ఆర్డీవో కార్యాలయం ముందు కెవిపిఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దళితులకు దళిత బంధు పథకం ప్రవేశపెడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం దళారుల ద్వారా బినామీలతో లబ్ధిదారుల ఎంపిక చేసి డబ్బులు పంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని చెప్పారు. దళిత బంధు పథకం ఆయన ఎమ్మెల్యే అనుచరులు వారితో ఉన్న వారికి సెలక్షన్ చేసి ఇస్తున్నారని వాపోయారు. నిరుపేదలకు చెందాల్సిన ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా నియామకాలు చేస్తూ అగ్రవర్ణాలవారు పరీక్ష పరోక్షంగా అనుభవించడానికి ప్రయత్నాలు చేస్తూ అనుభవిస్తున్నారని డబ్బులను పంచుకుంటున్నారని ఆరోపించారు .కెవిపిఎస్ నాయకులు ఉప్పల  మల్ కయ్య మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల ఎంపిక చేసే ఈ పథకం రైతు బంధు పథకం రాజకీయ అనుచరుల కే దక్కుతుందని కోట్లాది రూపాయల డబ్బు ఉందని ఆయన ఆరోపించారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వని ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని రాజకీయం చేస్తోందని ఇంటికొక ఉద్యోగం ఎక్కడికి పోయిందని దళిత ముఖ్యమంత్రి పదవి ఎవరు అని భావిస్తున్నర ని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీనివాస్ వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.