అంగన్వాడి కేంద్రాలలో పోషన్ మాసం కార్యక్రమాలు

Published: Thursday September 02, 2021

ఇబ్రహీంపట్నం తేదీ సెప్టెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి : పోషన్ మాసం -2021 లో ముఖ్యంగా నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అవి 1.పెరుగుదల పర్యవేక్షణ 2.పెరటి తోటల పెంపకం 3. ఆరోగ్య పద్దతులను పాటించడం 4. ఆహార వైవిధ్యత ను మరియు అలవాట్లను పెంచడం నాలుగు అంశాలను ప్రజలకు మరియు లబ్దిదారులకు అవగాహన కల్పించి వారిలో సరైన మార్పు తీసుకరవడమే ఈ పోషన్ మాసం 2021 యొక్క ముఖ్య ఉద్దేశమని ఇబ్రహీంపట్నం ప్రాజెక్టు అధికారిని శాంతిశ్రీ తెలిపారు. మొదటి రోజు కార్యక్రమాలలో భాగంగా అంగన్వాడీ సెంటర్ లో ఉన్న పిల్లలందరి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రోజుకి కొంతమంది చొప్పున ఈ వారం మొత్తం గ్రోత్ మానిటరింగ్ చేసే విధంగా టీచర్ షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకోవాలి. రోజు కొంత మంది పిల్లల బరువులను తియ్యాలి. తీసిన బరువులను వెంటనే పోషన్ ట్రాకర్ అప్లికేషన్ లో నింపాలి. అదే విధంగా ఆ పిల్లల డేటా ని ఎన్ హెచ్ టి ఎస్ లో నింపడం కోసం  సూపర్ వైజర్ కు పంపించాలి. రోజు వారీ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా హోమ్ విజిట్ చెయ్యాలి. చేస్తున్న కార్యక్రమాలని  జన్ డ్యాష్ బోర్డ్ లో అప్లోడ్ చెయ్యాలని అంగన్వాడి టీచర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.  బుధవారం పోషణ పక్షం లో భాగంగా పోచారం, చర్ల పటేల్ గూడెం అంగన్వాడి కేంద్రంలో నేడు కార్యక్రమాలు నిర్వహించారు. చర్ల పటేల్ గూడెం సర్పంచ్ కంబాలపల్లి గీతారాం రెడ్డి ఆధ్వర్యంలో పోషణపక్షం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గీతా రామ్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులలో ఎదుగుదల లేకపోవడం,  పోషకాహార లేమి, తక్కువ బరువు,  గర్భిణీలు,  పాలిచ్చే తల్లులు, చిన్నారుల్లో ముఖ్యంగా బాలికల్లో రక్తహీనత పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆమె తెలిపారు. ఔషధ వ్యవస్థలన్నీ అద్భుత విజ్ఞానంతో కూడి తీసుకునే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గీతా రామ్ రెడ్డి సూపర్వైజర్ పద్మ వార్డు మెంబర్లు, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎమ్ లు, ఆశలు, బాలింతలు, గర్భిణీలు, పిల్లల తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.