ఇబ్రహీంపట్నం కోర్టు వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

Published: Monday May 02, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 1 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం కోర్టు ఏర్పాటు చేసి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఇబ్రహీంపట్నం కార్యవర్గ సభ్యులు 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు రంగారెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి రాజశేఖర్ రెడ్డి , జస్టిస్ అని రెడ్డి అభిషేక్ రెడ్డి, జస్టిస్ లక్ష్మణ్, శ్రీ జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి, జస్టిస్ సంతోష్ రెడ్డి, పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హైకోర్టు వారి సహకారంతో నాలుగు  న్యాయస్థానాలతో కూడిన భవన సముదాయానికి భూమి పూజ, న్యాయస్థానం సముదాయంలో న్యాయ దేవత విగ్రహ ఆవిష్కరణ, సావనీర్ ఆవిష్కరణ, సీనియర్ న్యాయవాదుల సన్మానం అదేవిధంగా గతంలో కోర్టులో  విధులు నిర్వహించిన న్యాయమూర్తులు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానంలో మౌలిక వసతులతో అవసరం చాలా ఉంది మౌలిక వసతులను సమకూర్చు కోవడంలో బార్ అసోసియేషన్ కార్యవర్గం ఆయన పాత్ర పోషించాలని వారు అన్నారు, స్థానికులైన జస్టిస్ అభిషేక రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రస్తుతం నాలుగు న్యాయస్థానాల ఏర్పాటు కు భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా న్యాయవాదులు శ్రద్ధ, నిజాయితీతో పని చేసి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించబడింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి లతోపాటు సంఘం జిల్లా ప్రధాన న్యాయమూర్తి  ఆర్ తిరుపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్, ప్రధాన కార్యదర్శి ముద్దం వెంకటేశం, అదనపు జిల్లా న్యాయమూర్తి సుదర్శన్ రాజగోపాల్ శ్రీమతి మంజరి సీనియర్ న్యాయమూర్తులు కిరణ్ స్థానిక సీనియర్ న్యాయమూర్తి ఇందిరా, రాజు మూర్తి, పిపి నరేష్, అనామిక, వరలక్ష్మి, జైపాల్ నాయక్, కృష్ణ, జగన్,  ధన్ రాజ్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు శాలువాలతో సత్కరించారు, ఆర్డిఓ వెంకటాచారి, ఎమ్మార్వో కర్ర అనిత, సీఐ సైదులు, సిఐ లింగయ్య, సీఐ వెంకటేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లాకు చెందిన న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.