పెండింగ్ పనులు పూర్తి చేయాలి

Published: Tuesday February 21, 2023
 వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 20 ఫిబ్రవరి ప్రజాపాలన : జిల్లాలోని అన్ని మండలాలలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర ప్రాధాన్యత పనులను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్ డి ఓ లు, అన్ని మండలాల తాసిల్దార్లు, కలెక్టర్ కార్యాలయ  సూపరింటెండెంట్ లతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల స్థాయిలో ప్రతిరోజు చేపట్టే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రాధాన్యత గల పోడు భూములు, ల్యాండ్ ఎక్విజేషన్, ఎన్నికలకు సంబంధించిన పనులతో పాటు ధరణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల  పరిష్కారానికి సంబంధించిన జి ఎల్ ఎం, మ్యుటేషన్స్, సక్సెషన్ ఇలాంటి అన్ని పనులను చేపట్టాలని అన్నారు.  ధరణి సమస్యలను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా పూర్తి బాధ్యతతో పని చేయాలని తాసిల్దార్లకు ఆదేశించారు. ఒక్క గుంట కూడా తారుమారు కాకుండా  పనులు చేయాలని ఆదేశించారు.   అన్ని తహసిల్ కార్యాలయాలలో నిర్వహించే ప్రజావాణి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ప్రజలకు కలిగేలా పనిచేయాలని సూచించారు.  ఇక నుండి అన్ని ధరణి సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం కావాలని, ప్రజలు జిల్లా కేంద్రము వరకు రాకుండా చూడాలన్నారు.  అలాగే అన్ని మండల స్థాయి నుండి గ్రామస్థాయి వరకు అన్ని శాఖల సిబ్బంది ప్రతి ఒక్కరూ అటెండెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈరోజు నుండి వంద శాంతం అటెండెన్స్ ను యాప్ ద్వారా నిర్వహించాలన్నారు.  టెలికాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ  అధికారి అశోక్ కుమార్, వికారాబాద్ ఆర్ డి ఓ విజయ కుమారి తో పాటు అన్ని మండలాల తాసిల్దార్లు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.