టిఆర్ఎస్ అధ్యక్షులు కామేష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Monday October 11, 2021
బాలాపూర్: అక్టోబర్10, ప్రజాపాలన ప్రతినిధి : మీర్ పేట్ కార్పొరేషన్ టిఆర్ఎస్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  నివాసంలో మర్యాద పూర్వకంగా సబితాఇంద్రారెడ్డి నీ కలిసి ఆమె ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా కామేష్ రెడ్డి మాట్లాడుతూ.... అమ్మవారి నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహంతో పాటు,నా రాజకీయ గురువు మాతృ సమానురాలు, తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ప్రజల గుండెల్లో అభిమానాన్ని చూరగొన్న, మా సభితమ్మ ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఆనందకరం ఉందని అర్కల కామేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సిరెడ్డి, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.