కేసీఆర్ పథకాలతో మారని ప్రజల జీవన ప్రమాణాలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమం

Published: Saturday July 23, 2022
బోనకల్, జులై 22 ప్రజా పాలన ప్రతినిధి: అసమానతలపై పోరాడేది , పేద ప్రజలకు అండగా నిలిచేది కమ్యూనిస్టులేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంత్ రావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల 15వ మహాసభలు చింతపట్ల గోపయ్య నగర్ (రాపల్లి) గ్రామం లో సిపిఐ మండల సహాయ కార్యదర్శి జక్కుల రామారావు , మరిదు ఈశ్వరమ్మ, ఏనుగు రవికుమార్ అధ్యక్షత శుక్రవారం నిర్వహించారు. ముందుగా అమరుల వీరుల స్థూపానికి జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంత్ రావు మాట్లాడుతూ నేటి అధికార పార్టీ నాయకులు ఆయా పార్టీలు ఓడిపోతే ఆ పార్టీ లో కొనసాగే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. మోదీ అధికారం లో వచ్చినప్పుడు రూ.450 ఉన్న ఎల్పీజీ సిలిండర్, నేడు రూ. 1150 పెంచడం తో సామాన్యుల నడ్డి విరుస్తున్నారన్నారు. పెట్రోల్ డీజిల్ నిత్యవసరాలు పెరగడంతో ప్రజలు కష్టాలపాలవుతున్నారన్నారని, 88 శాతం ఉన్న పేదలను మరిచి కేవలం 12 శాతం ఉన్న కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని విమర్శించారు.మన దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే పరిస్థితి నుంచి మతం పేరుతో మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటుందన్నారు. 1300 మంది విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే కెసీఆర్ వారి ఆశయాలను విస్మరించారని, కెసిఆర్ పథకాలతో పేద ప్రజల జీవన ప్రమాణాలు ఎంతవరకు పెరిగాయని ప్రశ్నించారు. 57 సంవత్సరాలకే పెన్షన్ ఏమైందని, కొత్త రేషన్ కార్డులు ఎంత మంది అందయన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ కు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసారని, వేల కోట్ల రూపాయలను టిఆర్ఎస్ ప్రభుత్వం లూటీ చేసిందని ఆరోపించారు. ఆనాడే భారత కమ్యూనిస్టు పార్టీ దున్నే వాడిదే భూమి అని, దళితులకు భూమి కోసం భూపోరాటాలు చేసిందన్నారు. టి ఆర్ ఎస్ మళ్ళీ అధికారం రావడానికి దళిత బంధు తో దళితులను మభ్యపెడుతుందని, టీఅర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అవినీతి పాల్పడూ, ప్రశ్నిస్తే కమ్యూనిస్టు లపై దాడులకు ప్రయత్నిస్తున్నారన్నాను. కేసీఆర్ ప్రభుత్వం నేటికి లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని, సకల రోగ నివారిణి లాగా రైతు బంధు చూపిస్తూ ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొడుతుందన్నారు. పెట్రోల్ డీజిల్ పెరుగుదలతో భూమి దున్నే ఖర్చు కూడా పెరిగిందన్నారు. 2016లో పంటల బీమా కింద రైతు నామ మాత్రం కడితే మిగతా నగదును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టేవి అన్నారు. కానీ ప్రస్తుతం అటువంటి భీమాలను ప్రభుత్వాలు తీసేసాయన్నారు. రైతాంగానికి భరోసా ఇచ్చే ప్రభుత్వాలు నేడు కరువయ్యాయన్నారు. టిఆర్ఎస్ బిజెపి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించి పోరాడుతామన్నారు. 
 
సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడుతూ....
 
కారు ఫ్యాను జెండాలు రాష్ట్రాలు దాటితే కనపడదని, పువ్వు జెండా దేశం దాటితే కనపడదని, ఎర్ర జెండా మాత్రం దేశ దేశాన, ఖండ ఖండానా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో ఎన్నో దేశాలకు అండగా నిలిచింది కమ్యూనిస్టు దేశాలేనన్నారు. రానున్న రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలే దేశానికి దిక్సూచిగా మారనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, తోట రామాంజనేయులు, మండల కార్యదర్శి యంగల ఆనందరావు, జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, ఏనుగు గాంధీ, బెజవాడ రవి, మందడపు రాణి, వూట్ల కొండలరావు,కొంగర రామారావు, జక్కా నాగభూషణం, ఎల్ గంగాధర్ గుప్తా, గిరిజన సంఘం అధ్యక్షుడు బాణోత్ భరత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, ఏనుగు రామకృష్ణ, ఏనుగు రవి కుమార్, సాధనపల్లి ఆమర్నాధ్ తదితరులు పాల్గొన్నారు.