ప్రపంచ చిత్తడి నేలలా దినోత్సవం నిర్వహించిన ఎప్డీఓ.

Published: Friday February 03, 2023
జన్నారం, ఫిబ్రవరి 2, ప్రజాపాలన:  ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవ సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ అటవీ పరిధిలోని గుండు గూడా, కలమడుగు ప్రభుత్వం పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు గురువారం ఎఫ్డిఓ మాధవరావు వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు చిత్తడి నేలలు వాటి ప్రాముఖ్యతపై వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవం పురస్కరించుకొని గెలుపొందిన విద్యార్థులకు  ఎఫ్.డి.ఓ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎఫ్.డి.ఓ మాట్లాడుతూ ప్రపంచ చిత్తడి నేలలు వాటి ప్రాముఖ్యత పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిత్తడి నేలల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వో హఫీజోద్దీన్, ఎన్. సి.సి అధికారి కట్ట రాజమౌళి, ప్రధానోపాధ్యాయులు కొండు జనార్ధన్, అటవీ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.