ఘనంగా శీలం విద్యాలత జన్మదిన వేడుకలు

Published: Thursday June 17, 2021
మధిర, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : భరత్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మధిర పురపాలక సంఘం వైస్ చైర్ పర్సన్ శీలం విద్యా లత జన్మదిన వేడుకలు బుధవారం స్థానిక భరత్ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల కేకును ఆమె కట్ చేశారు. అనంతరం భరత్ విద్యాసంస్థల డైరెక్టర్ వైయస్సార్ తెలంగాణ రాష్ట్ర నాయకులు శీలం వెంకటరెడ్డి తదితరులు శీలం విద్యాలతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని దేవున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు దేవంబోట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.