తెలంగాణ మూవీ, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బోనకల్ గ్రామాన

Published: Tuesday December 07, 2021
బోనకల్, డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి: ఎంతో ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 5 వ తారీకు ఆదివారం అన్నపూర్ణ స్టూడియో దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ మూవీ, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా బోనకల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రాథోడ్ 54 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ సపోర్ట్ చేసిన ప్యానల్ కు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీనివాస్ రాథోడ్ కు మరో ఆపోజిట్ ప్యానల్ సపోర్ట్ పలికింది. మరో ప్యానెల్ సపోర్ట్ పలికినప్పటికీ శ్రీనివాస్ రాథోడ్ మాత్రం సొంత ఇమేజ్ తో ప్రచారంలోకి దూసుకు వెళ్ళాడు. సపోర్ట్ చేసిన ప్యానెల్ కోర్ కమిటీ సభ్యులు అందరూ స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ శ్రీనివాస్ రాథోడ్ మాత్రం 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్ సపోర్ట్ చేసిన సమీప వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పావని మునీంద్ర బాబు పై 206 ఓట్లు సాధించి 54 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదే ఎన్నికల్లో పృథ్వీరాజ్ సతీమణి పద్మ రేఖ మహిళా కోటాలో వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది. ఆమె కేవలం ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలవడం, శ్రీనివాస్ రాథోడ్ మాత్రం 54 ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో దీంతో మూవీ, టీవీ ఆర్టిస్టులు ఆశ్చర్యపోయారు. ఇండస్ట్రీలో ఎంతో బలం ఉన్న పృధ్వీ రాజ్ ప్యానల్ కు వ్యతిరేకంగా నిలబడి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడమే కాకుండా అందరికంటే అత్యధిక ఓట్లు సాధించడంతో శ్రీనివాస్ రాథోడ్ ను పలువురు సినీ ఆర్టిస్టులు అభినందించారు. ఇంతటి ఘన విజయం సాధించిన శ్రీనివాస్ రాథోడ్ కు బోనకల్ మండల పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అభినందనలు తెలిపారు.