డాక్టర్ వృత్తి పవిత్రమైనది.. లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి..

Published: Saturday July 02, 2022

తల్లాడ,  జులై 1 (ప్రజా పాలన న్యూస్): జాతీయ డాక్టర్స్ డే వేడుకలను శుక్రవారం తల్లాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లాడ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. అనంతరం రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూతన క్లబ్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తాను లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా తొలిసారిగా డాక్టర్స్ డే  వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో డాక్టర్ వృత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. కరోనా కష్టకాలంలో కూడా డాక్టర్లు తమ ప్రాణాల సైతం తెగించి వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ కర్నాటి లక్ష్మారెడ్డి, లయన్స్ ప్రతినిధులు దసరా శ్రీనివాసరావు, లైన్స్ క్లబ్ ప్రస్తుత అధ్యక్షులు పులబాల వెంకటేశ్వర్లు, గుంటుపల్లి వెంకటయ్య, గుంటుపల్లి వెంకటేశ్వరరావు, కేతేపల్లి భాస్కరరావు, అనుమోలు సర్వేశ్వరరావు, నంబూరి కనకదుర్గ ప్రసాద్, ఆసుపత్రి సూపర్వైజర్ పెద్ద పుల్లయ్య, సిహెచ్ఓ భాస్కర్, పలువురు డాక్టర్లు ఉన్నారు.