వలిగొండ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Monday August 16, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : 

వెల్వర్తి లో...

మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలో 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామంలోని టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కలుకూరి రాములు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పసల అన్నమేరి శౌరీ, ఉపసర్పంచ్ తక్కళ్ళ శ్రావణి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు తక్కల్ల సంజీవ, గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు, నాయకులు కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.