కనీస సౌకర్యాలకు నోచుకోని "జోడేఘాట్ పోరు గ్రామాలు" ** జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కి వ

Published: Thursday September 08, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 07 (ప్రజాపాలన, ప్రతినిధి) : కొమురం భీం జిల్లా లోని   జోడేఘాట్ పోరు గ్రామాలు నేటికీ కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సైతం రాజు అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పేయి కి జోడేఘాట్ గిరి గ్రామాలలోని సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సైతం రాజు, జిల్లా కమిటీ సభ్యులు బక్కన్న,  అశోక్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ లు మాట్లాడుతూ పాట్నాపూర్ గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రానికి డాక్టర్లు రాక నెల రోజులుగా తాళం వేసి ఉందని, స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఇవ్వవలసిన పౌష్టిక ఆహారం కూడా రావడంలేదని,  గతంలో జోడేఘాట్ కి ఆసిఫాబాద్ నుండి బస్సు సౌకర్యం ఉండేదని, కానీ ఇప్పుడు రోడ్డు అధ్వానంగా మారి ఆల్ వత్తులు కోతకు గురై వాహనాలు నడవలేని దుస్థితి నెలకొందని దీనితో బస్సు రావడం లేదని అన్నారు. ప్రతిసారి అధికారులు, ప్రజాప్రతినిధులు, కొమురం భీం వర్ధంతి కి వచ్చి వెళ్తారే తప్ప మా గ్రామ సమస్యలు పట్టించుకునే వారే లేరని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి, మళ్లీ గిరి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.