ఎస్సీ ఎస్టీ, అట్రాసిటీ కేసు లకు త్వరలో పరిష్కారం చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ** ఎస్సీ

Published: Friday June 17, 2022

ఆసిఫాబాద్ జిల్లా జూన్16 (ప్రజా పాలన ప్రతినిధి) : ఎస్సీ ఎస్టీ, అట్రాసిటీ కేసులు  త్వరితగతిన పరిష్కారం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పి కె సురేష్ కుమార్, అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, రాజేశం, ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధిత కుటుంబాలకు ఆసరాగా  కల్పిస్తున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ఆయా శాఖల ద్వారా ప్రభుత్వం నుంచి  వచ్చే సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. యువత చెడు బారిన నడవకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ పై ఉందని అన్నారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 234 కేసులు నమోదు కాగా 93 పెండింగ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 11 కేసులు భూములకు సంబంధించినవి, 36 కేసులు పరిష్కారం దిశగా చివరి స్థాయికి వచ్చాయని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా బెల్టుషాపులు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని అన్నారు. అట్రాసిటీ యాక్ట్ వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యుల పై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు, డిఎస్పి శ్రీనివాస్, సంజీవన్, మన్నెమ్మ, అట్రాసిటీ కమిటీ సభ్యులు కేశవ్ రావు, అర్జు, గోపాల్, గణేష్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.