మురికి కాలువ నిర్మాణం చేపట్టి ఇబ్బందులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ కు నక్క జీవన్ వినతిపత్

Published: Tuesday September 21, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : జగిత్యాల పట్టణంలోని 12 వార్డు గాంధీనగర్ లో మురికి కలువా నిర్మాణం చేపట్టి ఇతర సమస్యలను పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని జగిత్యాల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ నక్క జీవన్ జిల్లా కలెక్టర్ రవిని కోరారు. ఈ మేరకు కౌన్సిలర్ జీవన్ సరిత సోమవారం వార్డుకు సంబంధించిన పలు సమస్యలతో కూడిన వినతిపత్రం కలెక్టరేట్ ఏఓ కు జీవన్ మాజీ కౌన్సిలర్ అల్లాల సరిత రమేష్ రావులు వినతిపత్రం అందజేశారు. జగిత్యాల నిజామాబాదు ప్రధాన జాతీయ రహదారి కుడివైపున గల నాలాకు వివిధ ప్రాంతాల్లోని మురుగు నీరు చేరి గాంధీనగర్ నాలా సరిగ లేకపోవడంతో మురికినీరు ఇండ్ల ప్రాంతంలోకి చేరి తాగునీటిని కలుషితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో వరద నీరు ఇండ్లలోకి చేరి దుర్వాసనతో ప్రజలు రోగాల భారిన పడుతున్నారని చింతకుంట చెరువు నుంచి గంజ్ నాలా వరకు పట్టణ ప్రగతి నిధులతో శాశ్వతంగా నాలా నిర్మాణం చేపట్టాలని కోరారు. మంచినీళ్ల భావి నుండి చలిగల్ వరకు డివైడర్లు లేక పోవడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఈ ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్స్ తో కూడిన డివైడర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతిపత్రంలో వివరించారు. ఈ సమస్యలపై పలుసార్లు మంత్రులు కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి కమిషనర్ కు విన్నవించిన ప్రయోజనం లేదని ఇకనైనా సమస్యను మీరే పరిష్కరించాలని కోరారు.