గ్రామ వీధులు శుభ్రంగా ఉండాలి...

Published: Sunday October 10, 2021
బీరుపూర్, అక్టోబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండల్ కేంద్రంలోని ఆసునూరి గూడెంలో కోవిడ్ టీకా కార్యక్రమాన్ని సర్పంచ్ గర్షకుర్తి శిల్పారమేష్ ప్రారంభించి బతుకమ్మ పండుగ చీరలను పంపిణీ చేశారు. గ్రామంలో అన్ని వార్డులు పరిశుభ్రంగా ఉండాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హరీష్ వార్డ్ సభ్యులు ఏఎన్ఎం ఆశ కార్యకర్తలు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.