మహా బతుకమ్మ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ.శ

Published: Saturday October 01, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 30 ( ప్రజాపాలన ప్రతినిధి): ఎమ్మేల్యే క్వార్టర్స్ లో జగిత్యాల పురపాలక సంఘం అధ్వర్యంలో మహా బతుకమ్మ పోస్టర్ ను ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ఆవిష్కరించినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మహా బతుకమ్మ పండుగ ఘనంగా జగిత్యాల లో ఘనంగా నిర్వహిస్తున్నాం అని అన్నారు. నూతన మున్సిపల్ కౌన్సిల్ అధ్వర్యంలో ప్రజలు, నాయకులు అందరూ కలిసి విజయవంతం చేయాలని అన్నారు. వచ్చే బతుకమ్మ పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత వస్తాననీ తెలిపారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత నియోజకవర్గం లో 172 చెరువులు బాగు చేసి, బతుకమ్మ పండుగ జరుపుకునే చెరువుల వద్ద బతుకమ్మ మెట్లు ఏర్పాటు చేశామని అన్నారు. పూల పండుగ ను ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాలని, మహా బతుకమ్మ లో ప్రజలు భాగస్వామ్యం కావాలి అని అన్నారు. రాష్ట్రంలోనే జగిత్యాల బతుకమ్మ  రెండవ అతిపెద్ద బతుకమ్మ అని అన్నారు. చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఆడపడుచులు అత్యంత గణనీయంగా జరుపుకునే గొప్ప పండగ బతుకమ్మ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, కౌన్సిలర్ లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.