108 సిబ్బందికి ఉత్తమ సేవకు దక్కిన అవార్డ్

Published: Friday December 30, 2022

బోనకల్, డిసెంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధి లో పని చేసే 108 సిబ్బంది కి త్రైమాసిక బెస్ట్ లైఫ్ సేవియర్ గా నేషనల్ గ్రీన్ హెల్త్ సర్వీసెస్  ఈఎంఆర్ ఐ హెడ్ ఖలీద్ వారు హైదరాబాద్  హెడ్ ఆఫీస్ నుండి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోట భాను సహాన్ ,పైలట్ మిడిదిడ్డి చక్రవర్తి  కి అవార్డ్ ,ప్రశంస పత్రం బోనకల్ టీమ్108 కు పంపించటం జరిగింది. దీనితో అవార్డు అందుకున్న 108 సిబ్బందికి డాక్టర్స్ శ్రీకాంత్, డాక్టర్ బాలకృష్ణ,ఆసుపత్రి సిబ్బంది వారిని అభినందించారు.