కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుదాం!

Published: Thursday March 04, 2021

తెలంగాణ రాష్ట్రానికి న్యాయం ప్రొ కోదండరామ్ తోనే సాధ్యం.
టీజేఎస్, టీపీటీఎఫ్, టీడీపీ, న్యూడెమోక్రసీ, పీడీఎస్ యు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, మార్చి 03, ప్రజాపాలన: మార్చి 14 న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ని పట్టభద్రులు ఓటుతో తిరస్కరించి కేసీఆర్ అరాచక, నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ పూర్ణచందర్రావు, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, టీడీపీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని, సీపీఐఎం(ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, పీడీఎస్ యు రాష్ట్ర నాయకులు కాంపాటి పృథ్వి అన్నారు. ఈ విషయమై బుధవారం మండల కేంద్రంలోని విద్యా సంస్థలలో ఉన్న పట్టభద్రులను కలిసి  ప్రొఫెసర్ కోదండరామ్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. నీళ్లు నిధులు నియామకాల కై సాధించుకున్న తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చిన కేసిఆర్ ప్రభుత్వం నిధులు స్వాహా చేయడమే గాని నియామకాలపై దృష్టి పెట్టకుండా తెలంగాణ బిడ్డలకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే  గొంతుకలను అణచివేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని, గడిచిన ఆరున్నర ఏండ్లలలో రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టివేసిందన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా నాయకులు నాగాచారి, మండల అధ్యక్షులు పొలెబొయిన కాంతారావు, టీజేఎస్ మండల బాధ్యులు గొళ్ళపల్లి రమేష్, న్యూడెమోక్రసీ నాయకులు గడ్డం లాలయ్య, లాలు, ఈసం క్రిష్ణ, కొమరం ప్రశాంత్ కుమార్, గుండాల ఉప సర్పంచ్ మానాల ఉపెందర్, టీడీపీ మండల నాయకులు ఇల్లందుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.