వర్షాలకు ఒరిగిన చెట్లను సరిచేసి,సపోర్ట్ ఇచ్చిన గ్రీన్ భద్రాద్రి టీం

Published: Friday July 01, 2022
భద్రాద్రి కొత్తగూడెం(ప్రజాపాలన బ్యూరో)భద్రాచలం పట్టణంలో గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు చెట్లు ఒరిగిపోయి,పడిపోయి ఉన్నాయి.ఓరిగిపోయిన మరియు పడిపోయిన చెట్లను గ్రీన్ భద్రాద్రి టీం గురువారం ఉదయం పరీక్షించి వాటికి కొత్త గుంతలు త్రవ్వి కర్ర సహాయంతో తాడు కట్టి నిలబెట్టడం జరిగింది.అదే విధంగా ఎక్కడైనా చెట్లు పడిపోయినచో మాకు సమాచారం అందించగలరని వాటిని చనిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తామని గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బోగాల శ్రీనివాస రెడ్డి అన్నారు.వృక్షాలను మనం రక్షిస్తే అవి మనకు ఎన్నో విధాలుగా ఉపయోగ పడతాయని,ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి కోశాధికారి ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి,పి ఆర్ ఓ కడాలి నాగరాజు,పార్క్ కృష్ణ,రాసమల్ల రాము పాల్గొన్నారు.
 
 
 
Attachments area