మానవత్వం చాటుకున్న "లంకా "

Published: Tuesday April 04, 2023
 మధిర, ఏప్రిల్ 3 ప్రజాపాలన ప్రతినిధి: ఏఊరు నీదoటే ఉన్నూరు నాదాంటావు...... యేడ నీ ఇల్లంటే చెట్టు నీడన వుంది అంటావు. ఈ మాటలు అభ్యుదయ కవి నుండి జాలువారిన మాటలు మనం చూసాం, విన్నాం.సరిగ్గా అదే మాటలు చెపుతున్నారు. ఈ అభాగ్యులు ఎవరో కాదు ఎక్కడో కాదు మధిర పట్టణం లో మధిర నందిగామ రోడ్డు లో డంపింగ్ యార్డ్ లో చెత్త చెదారం మధ్య కారుచికటిలో 5గురు బక్క చిక్కిన పిల్లలతో ఇద్దరు భార్య బర్తలు చిత్తు కాగితాలు పాత ఇనుప ముక్క లు ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుంటూ వాటిని అమ్ముకుంటుజీవనo
సాగిస్తున్నారు. వారే గుంటూరు కు చెందిన కొమరగిరి యాదగిరి మరియమ్మ దంపతులు చెత్త లోనె దుర్భర జీవితం అనుభవిస్తూన్నారు. వీరి పరి స్థితి గమనించిన ప్రముఖ సమాజిక సేవకుడు (మధిర ఆశ మిత్ర )లంకా కొండయ్య ఆరోగ్య పరివేక్ష కుడు గా డ్యూటీ కీ వస్తూవెళుతు వీరిని చూసి జాలి పడి వారివద్ద కు ఆదివారం సాయంత్రం వెళ్లి వారి మంచి చెడ్డ లు అడిగి తెలుసుకోని హృదయం చలించి వారి పిల్లలు కు వారికి సరిపడ బట్టలు పిల్లలకు పండ్లు స్టీల్ ప్లేట్లు ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను యాదవ బజారులో వున్న అంగన్వాడీ సెంటర్ కు పంపించాలి అని తెలియ పరచినారు ఎవరైనా దయార్ద హృదయులు ముందుకు వస్తే నిలువ నీడ కోసం రేకులు షెడ్డు వేయటానికి ముందుకు రావాలి అని కోరుకుంటున్నాను