పోడు భూముల సర్వే సక్రమంగా జరగాలి సిపిఎం బత్తల వెంకటేశ్వర్లు. బూర్గంపాడు (ప్రజా పాలన.)

Published: Tuesday November 22, 2022
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి,డబుల్ బెడ్ రూమ్ కట్టించాలని,స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారులు రైతుల దగ్గర నుండి బలవంతంగా పోడు భూమి లాక్కొని మొక్కలు వేసిన భూములుకు కూడా సర్వే చేయాలని నాన్ ట్రైబెల్ కు కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని,మార్కెట్ యార్డ్ నుండి ప్రదర్శనగా వెళ్లి ఎమ్మార్వో  భగవాన్ రెడ్డి కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశాం.ఈ సందర్బంగా తాసిల్దార్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి కలెక్టర్ కి మీ  సమస్యల్ని వివరించి పరిష్కారం అయ్యే దశగా ప్రభుత్వానికి పంపిస్తానని హామీ ఇచ్చారు.జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోడు సాగుదారులకి పట్టాలు ఇవ్వాలని డబుల్ బెడ్ రూమ్ స్థలాలు ఇచ్చి కట్టించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు ఎస్.కె అబీద ,కెవిపిఎస్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు ,కనితి నాగయ్య ,కారం రామారావు, పి చందర్రావు, కొర్స సైదమ్మ, మడకం నాగమణి ,సోడే సీత ,బోర్ర శిరీష, వేటకని జయ, జట్ల చంద్రశేఖర్, ఈశ్వరమ్మ, చింతల వరప్రసాద్, సున్నం శంకరమ్మ, సోయం జయమ్మ, కొర్రి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.