ఆధునిక పద్ధతిలో కూరగాయల సాగు

Published: Saturday November 19, 2022
 జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి
* వికారాబాద్ బ్యూరో 18 నవంబర్ ప్రజాపాలన : ఆధునిక సాంకేతిక పద్ధతులతో కూరగాయల సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి అన్నారు. శుక్రవారం ఉద్యానవన శాఖ మరియు ఇండియన్ ఇన్స్టట్యూట్ ఆఫ్ హార్టిల్చర్ రిసెర్చ్ బెంగళూరు వారి పరస్పర సహకారంతో ఎస్సీ ఎస్టీ రైతులకు ఆధునిక సాంకేతిక పద్దతులలో కూరగాయల సాగుకు ప్రోత్సాహ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ రైతులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హార్టికల్చర్ బెంగళూరు విడుదల చేసిన కోత్త వంగడాల విత్తనాల పంపిణీ మరియు సాగు లో ఆధునిక పద్ధతులపై  శాస్త్రవేత్తలు జూమ్ ఆన్లైన్ ద్వారా శిక్షణ నిర్వహించడం జరిగిందని జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం ఎల్లకొండ గ్రామంలో అవగాహన సదస్సును నిర్వించారు. సదస్సులో రైతులకు పంట వేసే విధానం సాగు పద్ధతులను శాస్త్రవేత్తలు వివరించారు. ఐఐహెచ్ఆర్ బెంగళూరు వారి కొత్త వంగడాలు సాగు చేసేలా మరియు అధునాతన పద్దతులు పాటిస్తు కొత్త వంగడాలను తెలంగాణ లో సాగు చేసేలా విత్తనాలు ఉచితంగా పంపిణి చేశారు. ఇందులో పాలకూర, కొత్తిమిర, బీర, చిక్కుడు, బీర్నేస్ సాగు పద్ధతుల పై SC రైతులకు అవగాహన కల్పించారు.
ఆనంతరం ఎల్లకొండ గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి మరియు నవాబుపేట్ ఉద్యాన అధికారి, అబ్దుల్ గఫ్ఫుర్ SC రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేశారు.  ఏల్లకొండ ఎఈఓ, రమాదేవి, ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు, పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఇదే కార్యక్రమం లో భాగంగా చించల్పెట్, సర్పన్ పల్లి మరియు కుమ్మరిగుడెం గ్రామాలకు చెందిన SC/ST రైతులకు ZOOM (online) శిక్షణ వికారాబాద్ నూతన కలెక్టరేట్ లో నిర్వహించబడింది. కార్యక్రమం అనంతరం జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి, డి. చక్రపాణి, రైతులకు బీర, చిక్కుడు మరియు బీర్నిస్ విత్తనాలు ఉచితంగా అందచేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంట లో దశల వారీగా ఇతర పథకాలు కూడా అందుతాయని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టు సహాయ సంచాలకులు, మల్లికార్జున్, ఉద్యాన అధికారులు, కమల,  వైజయంతి కళ్యాణ్, అర్చన, సబ్ అసిస్టెంట్ నరసింహ రెడ్డి, రైతులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.