బి సి పాలసీని అమలు చేయాలని సైకిల్ యాత్ర

Published: Wednesday July 06, 2022
మంచిర్యాల టౌన్, జూలై 05, ప్రజాపాలన : బి సి పాలసీని అమలు చేయాలని   మంగళవారం రోజున మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా నుండి లక్షటిపేట్ పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా వరకు  సైకిల్ యాత్ర చేపట్టిన బి సి సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ,
2017లో ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపి 210 డిమాండ్లతో కూడిన బీసీ పాలసీని రూపొందించిన టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్క పాలసీ అమలుకు నోచుకున్న దాఖలాలు లేకపోవడం అంటే ఇది ముమ్మాటికీ బి సి సమాజాన్ని మభ్య పెట్టడమే అవుతుంది అన్న విషయం బి సి సమాజం ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఉంది అన్నారు. 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బి సి  డిమాండ్లు అమలుకు నోచుకుంటాయన్న ఉద్దేశంతో రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించిన బీసీలకు స్వరాష్ట్రంలో కూడా  నిరాశ ఎదురవుతుంది అంటే టి ఆర్ ఎస్ ప్రభుత్వం కూడా బి సి వ్యతిరేక ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం అన్నారు. ఇప్పటికైనా 210 అంశాలతో రూపొందించిన బి సి పాలసీని అమలు చేసి బి సి ల ఆకాంక్షను నెరవేర్చాల్సిన భాధ్యత ఈ ప్రభుత్వం పై ఎంతైనా ఉంది. లేని పక్షంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టి ఆర్ ఎస్ పార్టీని బి సి ల వ్యతిరేక పార్టీగా ప్రకటిస్తాం అని హెచ్చించారు. ఈ కార్యక్రమంలో కొత్త పల్లి రమేష్, వైద్య భాస్కర్, రమణాచారి, కాగితాల సత్యనారాయణ,అందే సంతోష్ బాబు, జైపాల్ సింగ్, సలీం, పిట్టల రవి, సంఘం లక్ష్మన్, తదితరులు పాల్గొన్నారు.