బోనకల్ 108 పైలట్ కు బెస్ట్ శిక్షణ సర్టిఫికేట్ ప్రధానం

Published: Friday January 20, 2023
బోనకల్, జనవరి 19 ప్రజా పాలన ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామవరం మాత శిశు హాస్పిటల్ నందు 108 పైలట్ పునరు శిక్షణ గురువారం జరిగింది. ఇందులో భాగంగా బెస్ట్ కంప్లేషన్ పైలైట్స్ సర్టిఫికేట్ బోనకల్లో డ్యూటీ చేస్తున్నా డ్రైవర్ ఎంఎం మిథున్ చక్రవర్తి కి ప్రోగ్రామ్ మేనేజర్ భూమా నాగేంద్ర చేతుల మీదుగా బెస్ట్ శిక్షణ సర్టిఫికెట్ అందుకోవటం జరిగింది . ఈ కార్యక్రమం లో ఈఎంఈ అవుల దుర్గా ప్రసాద్, ఫ్లీట్ కోఆర్డినేటర్ సాయి కుమార్, శిక్షణ నిపుణులు గజేంద్ర, అరున్ కుమర్, టీ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.