ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, స్టేషనరీ పేరుమీద చేసే వ్యాపారాన్ని అరికట్టాలి

Published: Friday July 01, 2022

ఏబీవీపీ వీరపట్నం శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇబ్రహీంపట్నం  ఎంఈఓ కి వినతి  పత్రం అందజేయడం జరిగింది
ఈసందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశిధర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ వంగ.సంజీవ రెడ్డి మాట్లాడుతూ...పుస్తకాల పేరుమీద విద్యాసంస్థలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న,అనేక విద్యాసంస్థల్లో పుస్తకాలు,స్టేషనరీ మరియు యూనిఫాం పేరుమీద లక్షల్లో వ్యాపారం చేస్తున్న  డి ఈ ఓ మరియు  ఎం ఈ ఓ లు కనీసం సమస్యలు పట్టించుకునే స్థితిలో లేరని,విద్యా సంస్థలలో ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని కాలరాస్తూ యజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు దండుకుంటున్నాయని దీనికి వెంటనే అడ్డుకట్ట వేయాలని,పాఠశాల పీజుల బోర్డులను నోటిస్ బోర్డులో తప్పనిసరి చూపించాలి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ  ఎస్ ఎఫ్ డి  కన్వీనర్ సందీప్,హైదరాబాద్ నగర కార్యవర్గ సభ్యులు ప్రవీణ్,నగర  ఎస్ ఎఫ్ డి సాయి చందు,మహేందర్,గౌతమ్,నాని,నవీన్,లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.