అంగన్వాడీ టీచర్ల బిఎల్ఓ డ్యూటీ సమస్యలపై ఆర్డిఓకి వినతిపత్రం అందజేత.

Published: Thursday September 29, 2022
 చేవెళ్ళ సెప్టెంబర్ 28: (ప్రజా పాలన)
 
చేవెళ్ల మండల కేంద్రంలో  అంగన్వాడీ టీచర్లకు బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో ఏవో గారికి వినతి పత్రం అందించారు,    ఈ సందర్భంగా సిఐటియు చేవెళ్ల డివిజన్ కన్వీనర్ అల్లి దేవేందర్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు పని భారంతో అనేక ఇబ్బందులు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిఎల్ఓ డ్యూటీ వారితో చేయించడం వారికి పని ఒత్తిడి పెంచడమేనని అన్నారు. అంగన్వాడి టీచర్లకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు ఈఎస్ఐ పిఎఫ్ లేదు బీమా సౌకర్యం లేదు అంగన్వాడి టీచర్లు పని భారం భరించలేక అనారోగ్యానికి గురై చనిపోయిన ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రావడం లేదు కానీ ప్రభుత్వం వారితో అనేక పనులు చేయించుకుంటుంది దీనిని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు వ్యతిరేకిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు బేగరి అరుణ్ కుమార్ ఎర్రవల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు
 
 
 
Attachments area