వైభవంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం మహానదానం

Published: Thursday December 08, 2022

మధిర రూరల్ డిసెంబర్ 7, ప్రజా పాలన ప్రతినిధిమధిర పట్టణంలోని లడక బజార్లోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ  అయ్యప్ప స్వామి ఊరేగింపు ఆరట్టు ఉత్సవాలు బుధవారం నాడు వైభవంగా నిర్వహించారు.గత నెల 30వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాలలో  భాగంగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై ఉంచి అయ్యప్ప మాలదారులు, భక్తులు వైరా నది ప్రాంతం లో ఆరెట్ల ఉత్సవం భాగంగా బాణాసంచ కలుస్తూ, డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలతో స్వామివారిని ఘనంగా ఊరేగించారు.మధ్యాహ్నం  ప్రారంభమైన ఊరేగింపు పట్టణంలోని వైరా నది లో నది స్థానం ఆరట్టు ఉత్సవం  కొనసాగింది అనంతరం మహిళలకు పసుపు కుంకుమ వితరణ చేసి. మధ్యాహ్నం స్వామి వారు తిరిగి ఆలయం వద్దకు చేరుకున్న అనంతరం స్వామివారి ఉత్సవాలు. స్వామి వారితోపాటు అయ్యప్ప మాలదారులు, భక్తులు ఆలయం.అయ్యప్ప స్వామి ఊరేగింపు సందర్భంగా  స్థానిక లడక బజారుకు చెందిన  దేశభక్తి యువజన సంఘం, అయ్యప్ప భక్త బృందం  ఆధ్వర్యంలో .బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భముగా బుధవారం స్వామివారికి ఆరట్టు  నదీ స్నానానికి ఘనంగా నిర్వహించారు అనంతరం అయ్యప్ప దేవాలయం మహానదానికి కార్యక్రమం పసూర గ్రూప్ అధినేత పబ్బతి రవికుమార్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగా హనుమంతరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి అయ్యప్ప దేవాలయం కమిటీ వారికి సేవ చేసే భక్తులు అభినందనలు తెలుపుతూ ఈ మహా అన్నదాన కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చి స్వామి అయ్యప్ప కృపకు పాత్రుడా ఆలయ కమిటీ వారికి అభినందనలు తెలుపుతూ 15 మండలం వార్షికోత్సవం భాగంగా ఈ మహా అన్నదాన కార్యక్రమ స్వామి ప్రసాదం అందించటం ఆలయ కమిటీ వారికి అభినందనలు తెలిపారు. ఈరోజు ఉత్సవంలో భాగంగా   తొమ్మిది గంటలకు ఆలయం వద్ద నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని వైరా నది వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లి, నదీ స్నానం నిర్వహించి నది తీరం వద్ద విగ్రహానికి ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించి అనంతరం స్వామి వారికి అభిషేకించిన పసుపు, కుంకుమలను మహిళల సౌభాగ్యం కొరకు అందజేయడం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ మహా అన్నదానాన్ని ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ సేవకులు భక్తులు ప్రజలకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి అభినందనలు తెలిపారు ఆలయం వద్ద అయ్యప్ప లకు,  భక్తులకు మహా అన్నదానం సహకరించినందుకు దాతలకు ప్రజలకు సేవకులు అభినందనలు తెలిపారు. ఈరోజు ఉదయాస్తమ పూజలు అప్పారావు దంపతులు పూజలు నిర్వహించారు సాయంత్రం స్వామి అయ్యప్ప దేవాలయంలో పడి పూజ సివేలిి కార్యక్రమానికి అప్పారావు కుటుంబ సభ్యులు పాల్గొని మాలాదారులకు భిక్షష ఏర్పాటుచేసి నారు