బస్ స్టాండ్ రోడ్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ కు మరమ్మతులు

Published: Monday April 19, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 18 ప్రజాపాలన : మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినందుకు చింతిస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అన్నారు. ఆదివారం  వికారాబాద్ పట్టణ పరిధిలో గల గంగారం గ్రామానికి చెందిన 27వ వార్డులోని బస్టాండ్ రోడ్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో మరమ్మతులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు సహృదయంతో సమస్య పరిష్కారమయ్యేంత వరకు తాగునీటిని నిలువ చేసుకొని పొదుపుగా వాడుకోవాలని చైర్ పర్సన్ విజ్ఞప్తి చేశారు. మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మత్తు పనులను పర్యవేక్షించి అతి త్వరలో ప్రజల తాగునీటి సమస్యను తీర్చుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మత్తు పనులను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కౌన్సిలర్ హీరేకార్ సురేష్, ఏఈ రాయుడు, కృష్ణ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.