మండలంలో గ్రామపంచాయతీ నర్సరీలను సందర్శించిన ఎంపీడీవో

Published: Friday December 09, 2022

బోనకల్, డిసెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా మండలంలోని రాయనపేట, కలకోట, ఆళ్లపాడు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలను ఎంపీడీవో బోడిపూడి వేణుమాధవ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పాఠశాలలను బలోపేతం చేయాలని అందుకు గ్రామ పెద్దల సహకారం కూడా కావాలని అన్నారు. అనంతరం ప్రభుత్బ ప్రాథమిక పాఠశాలను చేస్తున్న పనుల ను పరిశీలించారు. అదేవిధంగా ఆయా గ్రామపంచాయతీల నర్సరీలను తనిఖీ చేశారు.నర్సరీ లో మొక్కల పెంపకం,నిర్వహణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.వేసవి లో మొక్కలు ఎండి పోకుండా వాటరింగ్ చేయాలని ఎం.పి.డి.ఓ., ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో మౌలిక వసతుల కల్పన కు అంచనాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎం పి ఓ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆయా గ్రామాల సర్పంచులు యంగల దయామని, కిన్నెరవాణి, మర్రి తిరుపతిరావు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.