ఎరువులు విత్తనాలు అమ్మే దుకాణాల ఆకస్మికంగా తనిఖీలు

Published: Wednesday May 18, 2022
 మంచిర్యాల టౌన్, మే 17, ప్రజాపాలన : నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు , వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు . మంగళవారం మంచిర్యాల పట్టణ కేంద్రం పరిధిలోని ఫర్టిలైజర్ షాప్స్, విత్తనాలు అమ్మే దుకాణాలపై పోలీస్ అధికారులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా కలిసి  ఎరువులు విత్తనాలు అమ్మే దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

రైతులకు నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు ఎవరు అమ్మా రాదని ఎవరైనా అమ్మితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. నకిలీ విత్తనాలు నాసిరకం ఎరువులు ఎవరైనా అమ్మితే 100 నంబరు కు కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ తనిఖీల్లో  టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఏడీఏ శివానంద్,  విత్తన ధ్రువీకరణ అధికారి దుర్గేష్, మంచిర్యాల డీఏవో కల్పన, మంచిర్యాల ఏడీఏ అనిత, ఏఓ మంచిర్యాల కృష్ణ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.