కెవిపిఎస్ రంగారెడ్డి రెడ్డి జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శి గా బి. సామెల్, యం. ప్రకాష్ కరత్

Published: Monday July 11, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి. కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా 3వ మహాసభలు ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్ లో కల్వకోలు దేవకమ్మ ఫంక్షన్ హాల్ లో కనకయ్య, అరుణ, చెన్నయ్య గారి అధ్యక్షతన తేదీ.09.07.2022 శనివారం రోజున జరిగింది. ఈ మహాసభలలో నూతన జిల్లా కమిటీ ని 27 మంది తో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ నూతన అధ్యక్ష, కార్యదర్శులు బి. సామెల్,ఎం ప్రకాష్ కారత్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 100యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్తు,స్మషన వాటికలు ఇల్లు కట్టుకోవడానికి పేద వారికి మూడు లక్షల రూపాయలు ఇస్తున్నారు.అది అమలుకు నొచుకొలెదు కానీ ఏ ఒక్క హామీ కూడా పేదలకు అందని ద్రాక్ష లా గానే మిగిలిపోయింది. దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మా సభలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. దళిత బంధు దళితులకి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నేటికీ అవి పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. కేవలం హుజురాబాద్ కే పరిమితం కాకుండా రాష్ట్రంలొని  మొత్తం దళితులు అందరికీ ఇవ్వాలన్నారు. నియోజకవర్గానికి 1500 మందికి కాకుండా అందరికీ ఇవ్వాలన్నారు అయిన ప్రతి దళిత కుటుంబానికిఅర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలన్నారు ఎమ్మెల్యేల, టిఆర్ఎస్ నాయకుల ప్రమేయం లేకుండా అధికారుల ద్వారా గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ 27 మందితో ఏర్పడిందన్నారు. నూతన అధ్యక్షులుగా బి సామేలు ,ప్రధాన కార్యదర్శిగా మస్కు ప్రకాష్ కరత్, ఉపాధ్యక్షుడిగా యం.ఆనంద్ బుచ్చయ్య, చెన్నయ్య,సహాయ కార్యదర్శి గా అరుణ, వెంకటేష్,భాస్కర్, మనోహర్ కమిటీ సభ్యులుగా జ్యోతి బాస్, రమేష్,యాదగిరి, జంగయ్య, తదితరులు ఎన్నికైనరు.ఈ మహాసభలకు ప్రత్యక్షంగా పరోక్షంగా  సహకరించిన ప్రతి ఒక్కరికి  కేవిపిఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ తరపున ధన్యవాదములు.