సిమ్మర్స్ పోటీల్లో భారీ విజయాలు పొందిన మధిర స్విమ్మర్స్

Published: Monday September 19, 2022

మధిర సెప్టెంబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి సిమ్మర్స్ పోటీల్లో మధిర సిమ్మర్స్ అనేక పథకాలు సాధించినట్లు మధిర సిమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి పేర్కొన్నారు ఆదివారం సికింద్రాబాద్లో డెకథ్లాను వారు నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో మధిర స్విమ్మర్స్ పాల్గొని పలు విభాగాల్లో బహుమతులను గెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి  ఆధ్వర్యంలో మధిర నుండి సికింద్రాబాద్ వెళ్లిన స్విమ్మర్స్  అసోసియేషన్ 30 మంది బృందం అన్ని విభాగాలలో కలిపి సుమారు 20 పథకాలు సాధించారు. వివిధ విభాగాల్లో బహుమతులు సాధించిన వారిలో మధిర సిమ్మర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చల్లా సత్యనారాయణ ప్రచార కార్యదర్శి చలవాది రాజశేఖర్ కార్యవర్గ సభ్యులు వట్టే సైదులు మాచర్ల శ్రీనివాసరావు మేకల ఉపేంద్ర ఊటుకూరు భాస్కరరావు షేక్ సుకూర్ మార్త ప్రసాద్ జూనియర్ స్విమ్మర్ నిహారిక కొత్తూరు శరవన్ చింతల ప్రణీత్ పాపయ్య అబ్దుల్ చోటు అబ్దుల్ షన్ను కడం గుణ యశ్వంత్ మెడల్స్ గెలుచుకున్నారు. సిమ్మర్స్ పోటీలో అత్యధిక బహుమతులను గెలుచుకున్న మధిర సిమ్మర్స్ ను మధిరకు చెందిన పలువురు ప్రముఖులు స్విమ్మర్స్ అసోసియేషన్ ని ఫోన్లో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.