మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై నిఘా

Published: Wednesday June 15, 2022
ఇంచార్జి డిసిపి మంచిర్యాల్ అఖిల్ మహాజన్ ఐపిఎస్.
 
మంచిర్యాల టౌన్, జూన్ 14, ప్రజాపాలన :  శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు అన్ని వర్గాల వారు పోలీసులతో సహకరించాలి , 
సోషల్ మీడియాలో  కొంతమంది వ్యక్తులు  వీడియో క్లిప్పింగ్స్, గుర్తులను అప్లోడ్ చేసి ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టులు పెట్టడం జరిగింది. సోషల్ మీడియా  పై , మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై, వారి కదలికలపై నిఘా పెట్టడం జరిగిందని చెప్పారు. ఈ సందర్బంగా ఇంచార్జ్ డీసీపీ  మాట్లాడుతూ సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా మరియు  ప్రజా భద్రత ,లా అండ్ ఆర్డర్  సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేల చూడడం  మంచిర్యాల పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు .చట్టవ్యతిరేక ,ప్రజా శాంతి కి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులతో సహకరించాలని కోరారు.