కోవిడ్ నిబంధనలను పాటిస్తూ గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి

Published: Thursday September 09, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి) : కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ సిఐ గోవింద్ రెడ్డి పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి రామంతపూర్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకుల సమావేశం అరోరా కళాశాల ప్రాంగణంలో రామంతపూర్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి, ఎస్ ఐ జయరాం రెడ్డి మరియు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ రేవెల్లి రాజు, కన్వీనర్ ఆర్.వి. శేఖర్, కోఆర్డినేటర్ చెన్నోజు హరీష్, పాండయ్య  తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తిండేరు హనుమంతరావు మాట్లాడుతూ రామంతపూర్లో గత 27 సంవత్సరాలుగా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఉప్పల్ సీఐ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ రామంతపూర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు వినాయక ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండప నిర్వాహకులను సమన్వయపరిచి సంస్కృతి సంప్రదాయాలతో వేడుకలను నిర్వహిస్తున్నారని ప్రశంసిస్తూ, మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రమేష్, వూరె నాగేష్ గుప్త, సోమ శ్రీనివాస్, సత్యనారాణ, శ్రీకాంత్, సాయినాథ్, రోషన్ తదితరులు పాల్గొన్నారు.