ధ్వంసమైన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలి జిల్లా కలెక్టర్

Published: Wednesday September 29, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిది వలిగొండ, రామన్నపేట గ్రామాల మధ్యన భారీ వర్షానికి ద్వoసమైన బిటి రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. మంగళ వారం మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని, శ్మశాన వాటికను, టేకుల సోమారం, నేమిలకాల్వలో పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పల్లెప్రకృతి వనాలను, హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించి మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులకు సూచించారు. కమ్మగూడెం పరిధిలో రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటుతున్న  ఉపాధిహామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాదారు. ఈ సందర్భంగా కూలీలు గత నాలుగు నెలలుగా రోజువారీ కూలీ డబ్బులు అందడం లేదని కలెక్టర్ కు విన్నవించగా వెంటనే వారు డిఆర్డీఓ పిడి ఉపేందర్ రెడ్డి ని కూలీలా సమస్యను పరిష్కరించాలని తెలిపారు. అనంతరం కమ్మగూడెం తుమ్మలగూడెం గ్రామాల మధ్యన ద్వoసమైన రోడ్డును పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల సమస్యలు తీర్చాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీనుతి రమేష్ రాజు, ఆర్ అండ్ బి అధికారులు శంకరయ్య, రాజశేఖర్ రెడ్డి, తహశీల్దార్ నాగలక్ష్మి, మండల పంచాయతీ అధికారి కేదారీశ్వర్, సర్పంచులు బొల్లా లలితా శ్రీనివాస్, చేగురి భిక్షపతి, తీగల కిష్టయ్య, ఆర్ ఐ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.